Thursday, February 10, 2011

రాజగోపురం పునాదుల్లో మణులు, బంగారు కాసులు?

గుప్తనిధి గప్‌చుప్!!
పూటగడవడానికి కూడా బేజారయ్యే పుల్లయ్య నెక్ట్స్‌డే నెక్లెస్ రోడ్డులో ఖరీదైన కారులో హుషారుగా వెళుతుంటాడు...
జేబులో ఎప్పుడూ చిల్లిగవ్వ కనిపించని సుబ్బారావు...
రెండు రోజుల్లోనే ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో అబ్బబ్బ అనిపించే ఫ్లాట్‌లోకి మారతాడు...
గుప్తనిధుల ఎఫెక్ట్‌తో ఓడలు బండ్లవుతాయి...
బండ్లు విమానాలై గాలిలోకి ఎగురుతాయి...
గుప్తనిధులు ఉన్నాయా?
ష్... ఎవరికంటా పడకుండా చదవండీ... ఏం తెలుసు...
మీ ఇంటి వెనకాల ఉన్నా ఉండొచ్చు...
గుప్తనిధుల ‘ఆశ’... దెయ్యాలున్నాయి అనే ‘భయం’లాంటి భ్రమేనా? ‘అవును’ అని మనం బలంగా బల్ల గుద్దేలోపు మన సువిశాలమైన భారతదేశంలో ఎక్కడో ఏ మూలో మణుల మిలమిలల, బంగారునాణేల ధగధగల వెలుగు కనిపిస్తుంది.
మీకు ఇంకా నమ్మకం కలగలేదా? అయితే ఓసారి శ్రీకాళహస్తి వెళ్లొద్దాం రండి.. ఎందుకు? శనిగ్రహపూజకా? కానే కాదు... అటు చూడండి...కూలిన రాజగోపురం కనిపిస్తోందా? మీకు కనిపించనిదేమింటే- దాని శిథిలాల క్రింద మిణుకు మిణుకుమనే మహా ఆశ. దాని పేరు ‘గుప్తనిధులు’. నిజమెంతో, అబద్ధమెంతో అతిశయోక్తి ఎంతో తెలియదుగానీ ఈ నిధుల కథను చాలామంది నమ్ముతున్నారు. రాజుల కాలంలో సంప్రదాయం ప్రకారం కట్టడాల పునాదుల్లో మణులు, బంగారు కాసులు వేసేవారట. ఈ లెక్క ప్రకారం రాజగోపురంలోని అంతస్తుల మధ్య గుప్తనిధులు లేకపోయినా పునాదుల్లో ఉండొచ్చుననేది కొందరి నమ్మకం.
శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయిన వార్త సంచలనం. అంతకంటే సంచలనం ఏమంటే శిథిలాలను తొలిగించే పని మొదలు కాగానే గుప్తనిధుల ప్రచారం పరమ గుట్టుగా సాగడం. శిథిలాలను తొలిగించే సందర్భంలో నిఘా ఏర్పాటు చేయకపోవడం స్థానికులకు నచ్చలేదు. దీంతో చుట్టూ కంచెను ఏర్పాటు చేసి కెమెరాల సాక్షిగా తవ్వకాలు ప్రారంభించారట.
ఇప్పుడు అడపూరుకు వెళదాం...
అమరావతి తరువాత అందమైన బౌద్ధక్షేత్రంగా పేరు ఉన్న అడవూరులో బౌద్ధులు ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకునేవారట. దొంగల అత్యాశతో ఇప్పుడు ఈ బౌద్ధక్షేత్రం ప్రశాంతతకు భంగం వాటిల్లింది. కొండ నుంచి దిగువకు పన్నెండు అందమైన స్థూపాలు ఉన్నాయి. గుప్తనిధుల ఆశతో గుర్తు తెలియని వ్యక్తులు అడపాదడపా వాటిని ధ్వంసం చేస్తుండేవాళ్లు.
‘‘శ్రీకాళహస్తికి వచ్చాం....
వాళ్లు ఇలా అనుకుంటున్నారు వీళ్లు అలా అనుకుంటున్నారు అని శిథిలాలను చూపి తప్పించుకున్నారు. అడవూరుకు వచ్చాం...
అదిగో అన్నారు... ఇదిగో అన్నారు...బౌద్ధక్షేత్రాలు చూపించారు. ఇక వెళదామా... అంటూ జారుకున్నారు. గుప్తనిధులు చూపించనేలేదు...’’
అవును కదా!
మీరు గుప్తనిధులను చూడకుండా ఈ పేజీని వదిలే ప్రసక్తే లేదు. అయితే మనం ముందుగా తమిళనాడులో ఉన్న సత్యమంగళం అడవుల్లోకి వెళదాం. ఏమిటి ఆలోచిస్తున్నారు? ప్రామిస్... ఈసారి తప్పకుండా మనం గుప్తనిధులను చూడొచ్చు.
ఫ్లాష్‌బ్యాక్:
కొట్టమలమ్‌లో మాధి అనే వృద్ధురాలు ఉంది. ఒక రోజు ఆమె తన ఇంటి చుట్టూ దట్టంగా ఉన్న పొదలను చూసి విసుక్కుంది. ‘‘ఎక్కడున్నారే...’’ అంటూ కేక వేసింది. మనవరాళ్లు వనిత, నాగమ్మలు బిలబిలమని పరుగెత్తుకు వచ్చారు. ‘‘ ఆ పొదలు చూడండి ఎలా పెరిగాయో... ఇవ్వాళ వాటిని నరికేసి శుభ్రం చేసేద్దాం’’ అని పురమాయించింది మాధి. చక చకా పని సాగిపోతోంది. కొంతసేపటి తరువాత నాగమ్మ కాలికి మట్టిపెంకు ఏదో గుచ్చుకుంది. కాలివైపు చూసుకున్న ఆమెకు భూమిలో కనిపించీ కనిపించని వస్తువు ఏదో కనిపిస్తోంది. అక్కడ తవ్వడం ప్రారంభించింది నాగమ్మ. కొద్దిసేట్లోనే ఒక పగిలిన కుండలో మన యాభైపైసల నాణేనికి కాస్త తక్కువ పరిమాణంలో బంగారు నాణేలు కనిపించాయి.
నాగమ్మ వెంటనే తన నానమ్మను పిలిచి చూపించింది. ‘వొళమ్మో!!!!!’ అని ఆమె అరిచిన అరుపుకు ఇరుగుపొరుగు వారందరూ వచ్చారు.
పద్నాలుగు, పదహారు శతాబ్దాల మధ్యకాలంలో చెలామణిలో ఉన్నాయని భావిస్తున్న ఈ నాణేలపై మంగళసూత్రం, జెండా, పులి బొమ్మలు ముద్రించబడి ఉన్నాయి. విషయం తెలిసిన గ్రామాధికారులు పరుగెత్తుకుంటూ వచ్చారు. బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ మ్యూజియమ్ క్యూరేటర్లు ఈ నాణేలును పరీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందచేశారు.
‘త్రవ్వకాల్లో ఇవి మాత్రమే దొరికాయా?’ ‘ఇవి మాత్రమే ఇచ్చి మిగిలినవి నొక్కేశారా?’ అనే కోణంలో ఆ ప్రాంత తహసిల్దారు, పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇప్పటిలా ఒకప్పుడు బ్యాంకులు లేవు కాబట్టి ప్రజలు రహస్య ప్రదేశాల్లో కుండలలోనో, బిందెలలోనో ధనాన్ని దాచిపెట్టేవారు. కొందరు బాగా గుర్తు పెట్టుకునేవారు...మరి కొందరేమో గుర్తు కోల్పోయి ‘ఎక్కడో దాచానే?’ అంటూ జీవితాంతం వెదుక్కుంటూనే ఉండేవారు. ఈలోపునే ఎవరో ఒకరు జరిపిన త్రవ్వకాల్లో ఠంగుమని బయటపడి వాళ్ల సొంతం అయ్యేవి. వాళ్ల జీవితవిధానంలో అనూహ్యమైన మార్పులు వచ్చేవి. ఈ నేపథ్యం నుంచి ‘నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఊరకే ఉండనివ్వవు’లాంటి సామెతలు పుట్టి ఉంటాయి.
జ్ఞాపకం పెట్టుకోవడానికి కొందరు దాచిన నిధుల దగ్గర ఏదో ఒక కొండగుర్తు పెట్టేవారు. అది ఉన్నంత వరకు ఓకే... అది మాయమైతే ఇక అంతే... ఆ గుప్తసొమ్ము ఎవరికో ఒకరి దక్కేది. రాజు తమ సొమ్మును ఏదో ఒక రహస్యప్రదేశంలో దాచి ఉంచేవాడని... ఆ రాజును యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని వశం చేసుకున్న మరో రాజుకు రహస్యనిధుల గురించి తెలిసి ఉండే అవకాశం లేదు కాబట్టి అవి ఏళ్ల తరబడి అలానే పడిఉండేవనీ... ఇలా గుప్తనిధుల పుట్టుక వెనుక కాల్పనిక, వాస్తవ కథలు ఎన్నో ఉన్నాయి.
మాయల బుట్ట
కష్టపడకుండానే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనుకునే శాల్తీల కోసం ప్రత్యేకంగా ఒక తెగ వెలిసింది. ఈ బాపతు మోసగాళ్లు ఊరూరు తిరిగి అమాయకులను, అత్యాశపరులను బుట్టలో వేసుకుంటారు. ఫలానా యాగం చేస్తే ఊరికి ఈశాన్య దిశలో మర్రిచెట్టుకు ఎడమ ప్రక్కన తవ్వితే నిధులు బయటపడతాయని నమ్మకంగా చెబుతారు. పాపం... అమాయకులు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇంటి వెనకాల జీవితాంతం తవ్వుతూనే ఉంటారు!
గుప్తనిధులు ఉన్నాయో, ఉన్నా ఊడ్చిపెట్టుకు పోయాయో... మనకైతే తెలియదు. గుప్తనిధుల చుట్టూ మాత్రం మన గ్రామీణసమాజంలో బ్రహ్మాండమైన మౌఖిక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎంతటి ‘అపనమ్మకి’ అయినా సరే ఆ కథలు వింటే గనక ఏ అర్ధరాత్రి వేళలోనో ఎవరూ లేనిది చూసి ఊరవతల మర్రి చెట్టు దగ్గర గడ్డపారతో ఒక పోటు పొడుస్తాడు!
ఖణేల్..! గుప్తనిధులు ఉండొచ్చు... పట్నంలో ఫ్లాటు కొనొచ్చు... వీలైతే ఒక సినిమా తీయవచ్చు... నెలకో దేశం చుట్టి రావచ్చు...
ఖణేల్..! మీరు కూడా ఓసారి ట్రై చేయండి!!!
- పాషా ' సాక్షి ' సౌజన్యంతో ..

Saturday, February 5, 2011

డిమాండు మాత్రమే ఘనం పసిడి నిల్వలు పూజ్యం!

బంగారం అంటే ప్రాణం పెట్టుకుంటారు ఆడబడుచులు. అందునా భారతీయ వనితలు మరీనూ. ఒకనాడు
సంప్రదాయ ఆభరణాలకు ప్రాధాన్యమిచ్చే పడతుల్లో ప్రస్తుతం మార్కెట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న కొంగ్రొత్త ఫ్యాషనబుల్‌ ఆభరణాల వినియోగం పెరిగి పోయింది. తొలి నుంచి మన దేశం స్వర్ణాభరణాల వినియోగానికి కేంద్ర స్థానంగా ఉండేది. మన దేశంలో ఏదైనా శుభకార్యం నిర్వహణ పసిడి కొనుగోలు చేయందే పూర్తి కాదు. అత్యధిక విలువ పెట్టి కొనుగోలు చేసే ఈ బంగారం వారి భవిష్యత్‌ అవసరాలు కూడా తీరుస్తుంది. ప్రస్తుతం ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా పసిడి ధర దూసుకు పోతున్నది.
ఇప్పుడు దేశాలన్నీ పసిడి నిల్వలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. పసిడి అంతర్జాతీయ మారక ద్రవ్యం కావడం కూడా అందుకు ఓ కారణం. అయితే జనాభాలో రెండో స్థానంలో ఉన్న మనదేశం దేశీయ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టే స్థాయి నుంచి ప్రపంచ బ్యాంక నుంచి టన్నుల కొద్దీ కొనుగోలుతో నిల్వలు పెంచుకునే స్థాయికి ఎదిగింది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే బంగారం నిల్వల కొనసాగింపులో భారత్‌ 11వ స్థానంలో ఉంది.
కానీ మన దేశ విస్తీర్ణంలో గానీ, జనాభాలో గానీ సరిపోలని సిట్జర్లాండ్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బంగారం నిల్వల్లో స్విట్జర్లాండ్‌లో ఏడవ స్థానంలో ఉంది. దానికంటే ముందు చైనా ఆరవ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర రూ.57, 316 పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు నాటకీయంగా సంప్రదాయక సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ బంగారం కొనుగోలుపై దృష్టిని కేంద్రీకరించారు. తదనుగుణంగా పసిడి సైతం తనకు స్వర్గధామంగా మారిన ప్రదేశాలకే తరలి వెళుతోంది. ప్రథమ స్థానంలో అమెరికా నిలిస్తే 15వ స్థానంలో వెనిజులా ఉంది.
నెలవారీగా ప్రపంచ స్వర్ణ మండలి వెలువరించే గణాంకాలను ఆధారంగా తీసుకుంటే..... రమారమీ ప్రపంచ వ్యాప్తంగా బంగారం నిల్వలు వివిధ దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, కేంద్రీయ బ్యాంకుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మొత్తం బంగారం నిల్వల్లో 20.5 శాతం అంటే సుమారు 29,787 టన్నుల బంగారం ప్రభుత్వాలు, బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థల పరిధిలో మగ్గుతుందన్నమాట.
భారత్‌
నిల్వల విలువ : రూ. 1, 13, 068 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 614.58 టన్నులు.
ది రిజర్వు బ్యాంక ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న బంగారం నిల్వల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 1,13, 068 కోట్లు ఉంటుంది. ఇది భారత్‌ విదేశీ ద్రవ్య నిల్వల్లో 6.9 శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా బంగారం నిల్వల్లో తన స్థానాన్ని పెంచుకునేందుకు భారత్‌ తహతహ లాడుతోంది. 2009 నవంబర్‌లో భారత్‌ ఐఎంఎఫ్‌ నుంచి 200 టన్నుల బంగారం 6.9 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. భూగర్భ నిధులను వెలికి తీసేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని భారత ప్రభుత్వం, జాతీయ జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను ఆదేశించింది.ఏయే దేశాలు అత్యధికంగా బంగారం నిల్వలు కొనసాగిస్తున్నాయో తెలుసుకోవాలని ఉందా ఒకసారి పరిశీలిద్దాం.
 అమెరికా
నిల్వల విలువ : రూ.16,49, 698 కోట్లు.
నిల్వ ఉన్న బంగారం : 8,965.65 టన్నులు.
కెంటకీలోని అమెరికా బులియన్‌ డిపాజిటరీ కేంద్రం 'ఫోర్ట్‌ నాక్స'గా ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధి చెందిందని అందరికీ సుపరిచితమే. ఈ సంస్థలోనే దేశంలోని స్వర్ణాభరణాలు, బంగారు బిస్కట్లు, కాయిన్ల నిల్వలు అత్యధికంగా ఉంటాయి. మూడు చోట్ల నిల్వ ఉన్న బంగారమంతా 8,965.65 టన్నులు కాగా, దాని విలువ మన కరెన్సీలో చెప్పాలంటే రూ.16, 49,698 కోట్లు (358.63 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) ఉంటుంది.
జర్మనీ
నిల్వల విలువ : రూ.6,90, 782 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 3754.29 టన్నులు
జర్మనీ సెంట్రల్‌ బ్యాంక 'డౌట్‌చే బుండేస్‌ బ్యాంక'లో దేశంలోని నిల్వలన్నీ ఉంటాయి. వాటి విలువ అమెరికన్‌ డాలర్లలో 150.17 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. మన దేశ కరెన్సీ లెక్కల ప్రకారం జర్మనీలో నిల్వ ఉన్న బంగారం విలువ రూ.6, 90, 782 కోట్ల మేరకు ఉంటుంది.
ఇటలీ
నిల్వల విలువ : రూ. 4,97, 122 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 2,701.9 టన్నులు.
'బంచా డిల్టాలియా' అనే సంస్థలోనే ఇటలీకి చెందిన బంగారం నిల్వలన్నీ ఉంటాయి. ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం ఇటలీ 2709.9 టన్నుల పసిడి నిల్వలు కలిగి ఉన్నదని తెలుస్తోంది. ఇది ప్రపంచంలోని బంగారం నిల్వల్లో నాల్గవ వంతు ఉంటుంది. దీని విలువ భారత కరెన్సీలో రూ.4,97, 122 కోట్లు.
ఫ్రాన్స్‌
నిల్వల విలువ : రూ. 4,93, 810 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 2,683.81 టన్నులు
బాంక్యూ డి ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ జాతీయ బ్యాంక దేశంలోని స్వర్ణ నిల్వలకు నిలయం. దీని విలువ ఫ్రాన్స్‌ విదేశీ ద్రవ్య నిల్వలతో పోలిస్తే 65.7 శాతం ఉంటుంది. 2683.91 టన్నుల బంగారం నిల్వల విలువ సుమారు 107.35 బిలియన్‌ డాలర్లు (రూ.4,93, 810 కోట్లు) ఉంటుందని అంచనా.
చైనా
నిల్వల విలువ : రూ. 2,13,716 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 1,161.6 టన్నులు.
ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా చైనా స్వర్ణ నిల్వల్లోనే ఆరో స్థానంలో నిలిచింది. భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని ఊహించగలమా కావచ్చు, కానీ చైనా పసిడి నిల్వల విలువ ఆ దేశ విదేశీ ద్రవ్య విలువలో కేవలం 1.6 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. 130 కోట్ల మంది జనాభా ఉన్న ఈ చైనాలో ప్రతి ఒక్కరూ 34.70 డాలర్ల విలువ చేసే స్వర్ణాభరణాలు కలిగి ఉంటారు.
స్విట్జర్లాండ్‌
నిల్వల విలువ : రూ. 2,10, 864 కోట్ల
నిల్వ ఉన్న బంగారం : 1,146 టన్నులు.
స్విట్జర్లాండ్‌ ద్రవ్య విధానాన్ని నియంత్రించే స్విస్‌ నేషనల్‌ బ్యాంక గణాంకాల ప్రకారం దేశంలో 1,144.1 టన్నుల బంగారం ఉంది ఇది ప్రపంచంలోని నిల్వల్లో ఏడో స్థానంలో ఉంటుంది. దీని విలువ సుమారు 45.84 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు కాగా, భారత కరెన్సీలో రూ. 2,10, 864 కోట్లు ఉంటుంది. ఇటలీ విదేశీ నిధులతో పోలిస్తే ఇది 27.1 శాతం ఉంటుంది.
 జపాన్‌
నిల్వల విలువ : రూ. 1,55, 158 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 843.25 టన్నులు.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం నిల్వల్లో ఎనిమిదో స్థానంలో ఉన్న జపాన్‌, విదేశీ ద్రవ్య నిల్వల్లో స్వర్ణ నిల్వల విలువ కేవలం 2.5 శాతం మాత్రమే. దేశీయంగా బంగారం నిల్వల లావాదేవీలను బ్యాంక ఆఫ్‌ జపాన్‌ పర్యవేక్షిస్తుంది. జపాన్‌ బంగారం నిల్వల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.155, 158 కోట్లు ఉంటుంది.
రష్యా
నిల్వల విలువ : రూ. 1,29, 996 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 706.38 టన్నులు.
రష్యా ఫెడరేషన్‌ సెంట్రల్‌ బ్యాంకదిే దేశంలోని బంగారం నిల్వల నిర్వహణ బాధ్యత. 2009 నాటికి రష్యా విదేశీ ద్రవ్య నిల్వల్లో బంగారం నిల్వల విలువ కేవలం 5.1 శాతం మాత్రమే. తర్వాత అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం కొత్తగా గనుల తవ్వకం చేపట్టి ఏటా 21 శాతం బంగారం అదనంగా ఉత్పత్తి చేస్తోంది. అమెరికన్‌ డాలర్ల ప్రకారం ప్రస్తుతం రష్యాలో బంగారం నిల్వల విలువ అక్షరాల 28.26 బిలియన్‌ డాలర్లు కాగా, 708.38 టన్నులు నిల్వలున్నాయి.
నెదర్లాండ్స్‌
నిల్వల విలువ : రూ. 1,23, 740 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 674.98 టన్నులు.
నెదర్లాండ్‌ బ్యాంక, బంగారం నిల్వలతోపాటు దేశీయ ఆర్థిక వ్యవహారాలను నియంత్రిస్తుంటుంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో అందుబాటులో ఉన్న నిల్వలు సుమారు 26.9 అమెరికన్‌ బిలియన్లు కాగా, ప్రస్తుత గ్లోబల్‌ మార్కెట్‌లో నెదర్లాండ్స్‌ విదేశీ ద్రవ్య నిల్వల విలువ 53.4 శాతం ఉంటుంది.
తైవాన్‌
నిల్వల విలువ : రూ. 85, 882 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 466.81 టన్నులు.
ఆర్థికాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమను ముందుకు తీసుకెళుతున్న తైవాన్‌, పసిడి నిల్వల్లో 13వ స్థానంలో నిలవడం విశేషమే మరి. ది సెంట్రల్‌ బ్యాంక ఆఫ్‌ ది రిపబ్లిక చైనా (తైవాన్‌) దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. తైవాన్‌లో ప్రస్తుతం 466. 81 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. తైవాన్‌ విదేశీ ద్రవ్య నిల్వల్లో ఇది 4.1 శాతంగా ఉంది.
 పోర్చుగల్‌
నిల్వల విలువ : రూ. 77, 556 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 421.51 టన్నులు.
పోర్చుగల్‌ మాత్రమే తన విదేశీ ద్రవ్య నిధుల్లో 84.9 శాతం బంగారం నిల్వలున్న దేశం. బ్యాంకో డి పోర్చుగల్‌, దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. రమారమీ పోర్చుగల్‌లో నిల్వ ఉన్న 421.51 టన్నుల బంగారం విలువ అక్షరాలా 16.86 బిలియన్లు (77, 556 కోట్లు) ఉంటుంది.
వెనిజులా
నిల్వల విలువ : రూ. 73, 163 కోట్లు, నిల్వ ఉన్న బంగారం : 397.6 టన్నులు.బ్యాంకో సెంట్రల్‌ వెనిజులా దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. వెనిజులాలో 397.6 టన్నుల బంగారం నిల్వలున్నాయి. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 73, 163 కోట్లు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పసిడి నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో 15వ స్థానంలో నిలిచిన వెనిజులా విదేశీ ద్రవ్య నిల్వల్లో అవి 36.8 శాతం.
అంతర్జాతీయ ఆర్థిక నియంత్రణ సంస్థ (ఐఎంఎఫ్‌)
నిల్వల విలువ : రూ. 6.09, 040 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 3311.84 టన్నులు.
అంతర్జాతీయ ద్రవ్య నియంత్రణ సంస్థ (ఐఎంఎఫ్‌) వివిధ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థలో భారత్‌ సహా 185 సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సంస్థ స్వర్ణం (బంగారం)పై అనుసరిస్తున్న విధానంలో ప్రతి 25 ఏళ్లకోసారి మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం ఐఎంఎఫ్‌ వద్ద నున్న బంగారం నిల్వల విలువ 3311.84 టన్నులకు అమెరికా డాలర్లలో చెప్పాల్సి వస్తే 132.4 బిలియన్లు కాగా, భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.6,09,040 కోట్లు ఉంటుంది.
యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ఇసిబి)
నిల్వల విలువ : రూ. 1,01, 660 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 522.54 టన్నులు.
1998కల్లా ఏర్పాటైన యూరోపియన్‌ యూనియన్‌, సభ్య దేశాల్లో ద్రవ్య విధానంపై బాధ్యత వహిస్తుంది. జర్మనీ దేశంలోని ఫ్రాంకఫేర్డ్‌లో ఉన్న యూరోజోన్‌ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుత మార్కెట్‌ గణాంకాల ప్రకారం దాని విలువ రూ.1,01,660 కోట్లు ఉంటుంది.
 - ఎంవిఎస్‌ ప్రణవ్‌
andhra prabha daily -Fri, 4 Feb 2011.

Numbers and facts about gold

Some of the more extraordinary statistics which gold has accumulated across the centuries and around the world. 
* 79- protons The atomic number of gold, which means there are 79 protons in the nucleus of every atom of gold.
*  49ers- The 40,000 miners who joined the California Gold Rush in 1849 were called “49ers”. Only a very few ever got rich.
* 50 -miles One ounce of gold can be stretched to a length of 50 miles; the resulting wire would be just five microns wide.
 *  7.2 Million --- the number of times that all of the existing gold in the world, turned into 5 micron wire, could wrap around the planet.
 *  9- metres- square One ounce of pure gold could be hammered into a single sheet nine metres square.
 * 1064 degrees- centigrade Gold melts at 1064 degrees centigrade.
 * 2808 degrees centigrade ...And only boils at 2808 degrees centigrade.
 * 165,000 tonnes- This is the total number of tonnes of gold mined since the beginning of civilisation.
 * 20 metres cubed -... all of which would fit into a crate of 20 cubic metres..
 *  90% -Over 90 percent of the world’s gold has been mined since the California Gold Rush.
 * 100 -million million people worldwide depend on gold mining for their livelihood.
 *  31.103 grammes- The number of grams in a troy ounce of gold.
 * 400 troy ounces- The number of troy ounces in a “London Good Delivery Bar”.
 * 200 gold coins -Julius Caesar gave two hundred gold coins to each of his soldiers from the spoils of war in defeating Gaul.
  * 4,600 tonnes- Fort Knox holds 4,600 tonnes of gold.
  * 6,200 bars- And the US Federal Reserve holds 6,200.
  * 37 degrees- The temperature of the human body is 37 degrees centigrade. Because of gold’s unique conductivity, gold jewellery rapidly matches your body’s heat, becoming part of you.
  *  1oz- It is rarer to find a one ounce nugget of gold than a five carat diamond.
  * 60% -The percentage of gold mined today that becomes jewellery.
  * 394% -increase The % increase in the price of gold from Dec 2000 to October 2010.
  * 750 -parts per thousand The number of parts per thousand of pure gold in 18 carat gold.
  * 95 BC -In 95 BC, Chinese Emperor Hsiao Wu I minted gold commemorative piece to celebrate the sighting of a unicorn.
   * 53cm- The largest gold coin ever minted, a 2007 Canadian $1,000,000 Maple Leaf is 53cm in diameter.
   * 1922- Howard Carter made his famous “tiny breach of the top left hand corner of the doorway” to reveal the first glimpse of  Tutankhamun’s tomb on 26 November 1922.
* 15,000 tonnes- Even at only 10 parts of gold per quadrillion, the world’s oceans are estimated to hold up to 15,000 tonnes of gold.
*  2316 troy ounces- The largest ever true gold nugget weighted 2316 troy ounces when found at Moliagul in Australia in 1969. It was called the “Welcome Stranger”.
 *  US$55 billion- In November 2010, the SPDR Gold Shares (GLD) fund, a World Gold Council sponsored exchange traded fund, held over $55 billion assets under management.
 * 60%- World Gold Council members collectively represent around 60% of all corporate mining activity.
 * 35  -The number of times gold has reached a new high in 2010