గుప్తనిధి గప్‌చుప్!!
పూటగడవడానికి కూడా బేజారయ్యే పుల్లయ్య నెక్ట్స్‌డే నెక్లెస్ రోడ్డులో ఖరీదైన కారులో హుషారుగా వెళుతుంటాడు...
జేబులో ఎప్పుడూ చిల్లిగవ్వ కనిపించని సుబ్బారావు...
రెండు రోజుల్లోనే ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో అబ్బబ్బ అనిపించే ఫ్లాట్‌లోకి మారతాడు...
గుప్తనిధుల ఎఫెక్ట్‌తో ఓడలు బండ్లవుతాయి...
బండ్లు విమానాలై గాలిలోకి ఎగురుతాయి...
గుప్తనిధులు ఉన్నాయా?
ష్... ఎవరికంటా పడకుండా చదవండీ... ఏం తెలుసు...
మీ ఇంటి వెనకాల ఉన్నా ఉండొచ్చు...
గుప్తనిధుల ‘ఆశ’... దెయ్యాలున్నాయి అనే ‘భయం’లాంటి భ్రమేనా? ‘అవును’ అని మనం బలంగా బల్ల గుద్దేలోపు మన సువిశాలమైన భారతదేశంలో ఎక్కడో ఏ మూలో మణుల మిలమిలల, బంగారునాణేల ధగధగల వెలుగు కనిపిస్తుంది.
మీకు ఇంకా నమ్మకం కలగలేదా? అయితే ఓసారి శ్రీకాళహస్తి వెళ్లొద్దాం రండి.. ఎందుకు? శనిగ్రహపూజకా? కానే కాదు... అటు చూడండి...కూలిన రాజగోపురం కనిపిస్తోందా? మీకు కనిపించనిదేమింటే- దాని శిథిలాల క్రింద మిణుకు మిణుకుమనే మహా ఆశ. దాని పేరు ‘గుప్తనిధులు’. నిజమెంతో, అబద్ధమెంతో అతిశయోక్తి ఎంతో తెలియదుగానీ ఈ నిధుల కథను చాలామంది నమ్ముతున్నారు. రాజుల కాలంలో సంప్రదాయం ప్రకారం కట్టడాల పునాదుల్లో మణులు, బంగారు కాసులు వేసేవారట. ఈ లెక్క ప్రకారం రాజగోపురంలోని అంతస్తుల మధ్య గుప్తనిధులు లేకపోయినా పునాదుల్లో ఉండొచ్చుననేది కొందరి నమ్మకం.
శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయిన వార్త సంచలనం. అంతకంటే సంచలనం ఏమంటే శిథిలాలను తొలిగించే పని మొదలు కాగానే గుప్తనిధుల ప్రచారం పరమ గుట్టుగా సాగడం. శిథిలాలను తొలిగించే సందర్భంలో నిఘా ఏర్పాటు చేయకపోవడం స్థానికులకు నచ్చలేదు. దీంతో చుట్టూ కంచెను ఏర్పాటు చేసి కెమెరాల సాక్షిగా తవ్వకాలు ప్రారంభించారట.
ఇప్పుడు అడపూరుకు వెళదాం...
అమరావతి తరువాత అందమైన బౌద్ధక్షేత్రంగా పేరు ఉన్న అడవూరులో బౌద్ధులు ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకునేవారట. దొంగల అత్యాశతో ఇప్పుడు ఈ బౌద్ధక్షేత్రం ప్రశాంతతకు భంగం వాటిల్లింది. కొండ నుంచి దిగువకు పన్నెండు అందమైన స్థూపాలు ఉన్నాయి. గుప్తనిధుల ఆశతో గుర్తు తెలియని వ్యక్తులు అడపాదడపా వాటిని ధ్వంసం చేస్తుండేవాళ్లు.
‘‘శ్రీకాళహస్తికి వచ్చాం....
వాళ్లు ఇలా అనుకుంటున్నారు వీళ్లు అలా అనుకుంటున్నారు అని శిథిలాలను చూపి తప్పించుకున్నారు. అడవూరుకు వచ్చాం...
అదిగో అన్నారు... ఇదిగో అన్నారు...బౌద్ధక్షేత్రాలు చూపించారు. ఇక వెళదామా... అంటూ జారుకున్నారు. గుప్తనిధులు చూపించనేలేదు...’’
అవును కదా!
మీరు గుప్తనిధులను చూడకుండా ఈ పేజీని వదిలే ప్రసక్తే లేదు. అయితే మనం ముందుగా తమిళనాడులో ఉన్న సత్యమంగళం అడవుల్లోకి వెళదాం. ఏమిటి ఆలోచిస్తున్నారు? ప్రామిస్... ఈసారి తప్పకుండా మనం గుప్తనిధులను చూడొచ్చు.
ఫ్లాష్‌బ్యాక్:
కొట్టమలమ్‌లో మాధి అనే వృద్ధురాలు ఉంది. ఒక రోజు ఆమె తన ఇంటి చుట్టూ దట్టంగా ఉన్న పొదలను చూసి విసుక్కుంది. ‘‘ఎక్కడున్నారే...’’ అంటూ కేక వేసింది. మనవరాళ్లు వనిత, నాగమ్మలు బిలబిలమని పరుగెత్తుకు వచ్చారు. ‘‘ ఆ పొదలు చూడండి ఎలా పెరిగాయో... ఇవ్వాళ వాటిని నరికేసి శుభ్రం చేసేద్దాం’’ అని పురమాయించింది మాధి. చక చకా పని సాగిపోతోంది. కొంతసేపటి తరువాత నాగమ్మ కాలికి మట్టిపెంకు ఏదో గుచ్చుకుంది. కాలివైపు చూసుకున్న ఆమెకు భూమిలో కనిపించీ కనిపించని వస్తువు ఏదో కనిపిస్తోంది. అక్కడ తవ్వడం ప్రారంభించింది నాగమ్మ. కొద్దిసేట్లోనే ఒక పగిలిన కుండలో మన యాభైపైసల నాణేనికి కాస్త తక్కువ పరిమాణంలో బంగారు నాణేలు కనిపించాయి.
నాగమ్మ వెంటనే తన నానమ్మను పిలిచి చూపించింది. ‘వొళమ్మో!!!!!’ అని ఆమె అరిచిన అరుపుకు ఇరుగుపొరుగు వారందరూ వచ్చారు.
పద్నాలుగు, పదహారు శతాబ్దాల మధ్యకాలంలో చెలామణిలో ఉన్నాయని భావిస్తున్న ఈ నాణేలపై మంగళసూత్రం, జెండా, పులి బొమ్మలు ముద్రించబడి ఉన్నాయి. విషయం తెలిసిన గ్రామాధికారులు పరుగెత్తుకుంటూ వచ్చారు. బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ మ్యూజియమ్ క్యూరేటర్లు ఈ నాణేలును పరీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందచేశారు.
‘త్రవ్వకాల్లో ఇవి మాత్రమే దొరికాయా?’ ‘ఇవి మాత్రమే ఇచ్చి మిగిలినవి నొక్కేశారా?’ అనే కోణంలో ఆ ప్రాంత తహసిల్దారు, పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇప్పటిలా ఒకప్పుడు బ్యాంకులు లేవు కాబట్టి ప్రజలు రహస్య ప్రదేశాల్లో కుండలలోనో, బిందెలలోనో ధనాన్ని దాచిపెట్టేవారు. కొందరు బాగా గుర్తు పెట్టుకునేవారు...మరి కొందరేమో గుర్తు కోల్పోయి ‘ఎక్కడో దాచానే?’ అంటూ జీవితాంతం వెదుక్కుంటూనే ఉండేవారు. ఈలోపునే ఎవరో ఒకరు జరిపిన త్రవ్వకాల్లో ఠంగుమని బయటపడి వాళ్ల సొంతం అయ్యేవి. వాళ్ల జీవితవిధానంలో అనూహ్యమైన మార్పులు వచ్చేవి. ఈ నేపథ్యం నుంచి ‘నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఊరకే ఉండనివ్వవు’లాంటి సామెతలు పుట్టి ఉంటాయి.
జ్ఞాపకం పెట్టుకోవడానికి కొందరు దాచిన నిధుల దగ్గర ఏదో ఒక కొండగుర్తు పెట్టేవారు. అది ఉన్నంత వరకు ఓకే... అది మాయమైతే ఇక అంతే... ఆ గుప్తసొమ్ము ఎవరికో ఒకరి దక్కేది. రాజు తమ సొమ్మును ఏదో ఒక రహస్యప్రదేశంలో దాచి ఉంచేవాడని... ఆ రాజును యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని వశం చేసుకున్న మరో రాజుకు రహస్యనిధుల గురించి తెలిసి ఉండే అవకాశం లేదు కాబట్టి అవి ఏళ్ల తరబడి అలానే పడిఉండేవనీ... ఇలా గుప్తనిధుల పుట్టుక వెనుక కాల్పనిక, వాస్తవ కథలు ఎన్నో ఉన్నాయి.
మాయల బుట్ట
కష్టపడకుండానే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనుకునే శాల్తీల కోసం ప్రత్యేకంగా ఒక తెగ వెలిసింది. ఈ బాపతు మోసగాళ్లు ఊరూరు తిరిగి అమాయకులను, అత్యాశపరులను బుట్టలో వేసుకుంటారు. ఫలానా యాగం చేస్తే ఊరికి ఈశాన్య దిశలో మర్రిచెట్టుకు ఎడమ ప్రక్కన తవ్వితే నిధులు బయటపడతాయని నమ్మకంగా చెబుతారు. పాపం... అమాయకులు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇంటి వెనకాల జీవితాంతం తవ్వుతూనే ఉంటారు!
గుప్తనిధులు ఉన్నాయో, ఉన్నా ఊడ్చిపెట్టుకు పోయాయో... మనకైతే తెలియదు. గుప్తనిధుల చుట్టూ మాత్రం మన గ్రామీణసమాజంలో బ్రహ్మాండమైన మౌఖిక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎంతటి ‘అపనమ్మకి’ అయినా సరే ఆ కథలు వింటే గనక ఏ అర్ధరాత్రి వేళలోనో ఎవరూ లేనిది చూసి ఊరవతల మర్రి చెట్టు దగ్గర గడ్డపారతో ఒక పోటు పొడుస్తాడు!
ఖణేల్..! గుప్తనిధులు ఉండొచ్చు... పట్నంలో ఫ్లాటు కొనొచ్చు... వీలైతే ఒక సినిమా తీయవచ్చు... నెలకో దేశం చుట్టి రావచ్చు...
ఖణేల్..! మీరు కూడా ఓసారి ట్రై చేయండి!!!
- పాషా ' సాక్షి ' సౌజన్యంతో ..